లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
ఎడపల్లి, అక్టోబర్ 31 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో బొధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ వారి సహకారం తో ఎడపల్లి నయాబధి గ్రామం లో డయాబెటిక్ క్యాంప్ మరియు ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో డాక్టర్ అజయ్ సుమారు75 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 50 మందికి మోతె బిందు గుర్తించి వారిని వుచిత కన్ను శస్త్ర చికిత్స నిమిత్తం మన బోధన్ లయన్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది.ఇ కార్యక్రమo లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత సెక్రటరీ మెర్సీ కోశాధికారి శంకర్ జి ఈ టి కో-ఆర్డినేటర్సూర్యనారాయణ గంగారెడ్డి కాశీనాథ్ ప్రకాష్ మనోజ్ పి ఆర్ ఓ రాకేష్ వర్మ గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగరాజ్ గౌడ్ సిబ్బంది వాన్ ఇంచార్జ్ హన్మంథ్ రావు తధితరులు పాల్గొనారు.