Take a fresh look at your lifestyle.

నమ్మించి మోసం చేసింది..కావాలనే ఇబ్బందులకు గురిచేస్తుంది…..

0

నమ్మించి మోసం చేసింది..కావాలనే ఇబ్బందులకు గురిచేస్తుంది..

– ఉమెన్ రైట్స్ అధికారుల.. స్థానిక అధికారుల, ప్రజా ప్రతినిధుల, సంఘ సభ్యుల మాట పట్టించుకోకుండా హిస్టారీతిగా చేస్తుంది..

– మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి ఏళ్లుగా చుక్కలు చూపిస్తుంది..

-అంతి రెడ్డి స్వప్న (విజయ)

ఆర్మూర్ , డిసెంబర్ 31 ( లోకంతీరు ) : చాలా ఏళ్ల క్రితం మా మామయ్య గోవింద్ పెట్ మాజీ సర్పంచ్ అంతి రెడ్డి నరసయ్యను మా తోటి కోడలు అంతిరెడ్డి అలేఖ్య (రమ) రేంజర్లకు చెందిన ఆమె తండ్రి మాటలు నమ్మి మా మామయ్య నరసయ్య ఆయన పేరు మీద గల నాలుగు ఎకరాల పైచిలుకు భూమిని మా తోటి కోడలు వాళ్ళ పేరు మీద చేశాడని, ఆ సందర్భంలోనే తోటి కోడలు వాళ్ళ పేరు మీద ఉన్న భూమిని మా పేరు చేస్తామని మా మామయ్యకు చెప్పి నమ్మించి మోసం చేశారని అంతిరెడ్డి స్వప్న (విజయ) అన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్ గ్రామంలో ఇటీవల భూ సమస్యపై జరిగిన గొడవలో పంట నష్టం, పరికరాల నష్టం పై అంకిరెడ్డి స్వప్న (విజయ) సోమవారం విలేకరులతో మాట్లాడారు. మాకు రావలసిన రెండున్నర ఎకరాల భూమిపై గతంలో నమ్మించి మా తోటి కోడలు అలేఖ్య (రమ ) మోసం చేసిందన్నారు. రేంజర్లకు చెందిన ఆమె తండ్రి మా మామయ్య నాలుగు ఎకరాల పై చిలుకు భూమిని మా తోటి కోడలు కు రిజిస్ట్రేషన్ చేసిన ఆరు నెలల్లోనే అనారోగ్యంతో మృతి చెందినట్లు చెప్పారు. మా తోటి కోడలు తండ్రి మృతి చెందడంతో మా మామయ్యకు నాకు మా తోటి కోడలు అలేఖ్య (రమ) అసలే వినడం లేదని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఈ విషయమై ఉమెన్ రైట్స్ జిల్లా ప్రతినిధి హనుమ గౌడ్ దృష్టికి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్, వేల్పూర్ ప్రాంతంలోని పోలీసులతో పాటు, గోవింద్ పెట్ కుల సంఘ పెద్దలతో , ప్రజా ప్రతినిధులతో ఎన్నిసార్లు మా తోటి కోడలు అలేఖ్య (రమ) కు చెప్పించిన పట్టించుకోవడం లేదని ఎవరి మాట లెక్కచేయడం లేదని అంతిరెడ్డి స్వప్న (విజయ) వాపోయింది. గతంలోనే మా తోటి కోడలు తండ్రి కాలం చెల్లక ముందు మా మామయ్యతో మాట్లాడి నాలుగున్నర ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆ మాట సమయంలోనే మా తోటి కోడలు పేరు పైన గల రెండున్నర ఎకరాల భూమిని మాకు చేయిస్తానని నమ్మించి మోసం చేసిందని స్వప్న వివరించింది. ఈ మోసంపై పలుమార్లు ఇరువర్గాల కుల పెద్దలతో మాట్లాడించిన పట్టించుకోవడంలేదని స్వప్న పుట్టెడు దుఃఖంతో ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు డబ్బులను సైతం మాకు ఇవ్వకుండా అన్ని మా తోటి కోడలు వాడుకుందని స్వప్న ఆమె బాధను ఏకరువు పెట్టింది. సమస్యను ఆర్మూర్ వేల్పూర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పోలీసులను సైతం మీరు సివిల్ పంచాయతీల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటూ శాంతిభద్రతలు కల్పిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులను సైతం బెదిరిస్తున్నట్లు అంతిరెడ్డి స్వప్న వివరించింది. రెండున్నర ఎకరాల భూమిని మాకు చేయించేందుకు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి మా తోటి కోడలు అలేఖ్య (రమ ) హరిగోశ ను, చెప్పరాని బాధలు పెడుతుందంటూ అంతిరెడ్డి స్వప్న చెబుతుంది. నా భూమిలో ఉన్న రిగ్గును తీయించండి మీ భూమిని మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తా అని చెప్పి ఆ రిగ్గును తీయించిన తర్వాత కూడా మరొక విషయంతో మెలిక పెడుతూ మా భూమిని రిజిస్ట్రేషన్ చేయక మా తోటి కోడలు అలేఖ్య ( రమ ) చుక్కలు చూపిస్తుందని రైతు అంతిరెడ్డి స్వప్న తీరని దుఃఖంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇటీవల ఇరువర్గాలు మరొకసారి పిలిపించి రెండు వర్గాలతో మాట్లాడి ఒప్పందం చేసుకుందామని ఆ రెండు వర్గాల మాటలను సైతం వినడం లేదని రైతు స్వప్న వాపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, గోవింద్ పెట్ రైతులు, ప్రజలు న్యాయబద్ధంగా సహకరించి మాకు రావలసిన భూమి మా తోటి కోడలు రిజిస్ట్రేషన్ చేయించేలా చూడాలని రైతు స్వప్న వేడుకుంటుంది.

Leave A Reply

Your email address will not be published.