Take a fresh look at your lifestyle.

కన్నుల విందుగా కాలభైరవుడి జన్మదిన వేడుకలు….

0

కన్నుల విందుగా కాలభైరవుడి జన్మదిన వేడుకలు

 

కామారెడ్డి ప్రతినిధి, నవంబర్ 23 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామాలలో వెలసిన శ్రీకాల భైరవ స్వామి మహా పుణ్యక్షేత్రం స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీకమాసం పురస్కరించుకొని స్వామివారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతుంటారు. వేడుకలలో భాగంగా ఉదయం 6 గంటలకు సంతతారాభిషేకం సప్తమి, దేవస్థాన పర్యవేక్షణలో ధ్వజారోహణము, మహా పూజ, దక్షయజ్ఞ కార్యక్రమములు, మధ్యాహ్నం స్వామివారికి సింధూర పూజ, డోలారోహణము, కార్యక్రమాలను అదేవిధంగా అంగరంగ వైభవంగా అందంగా అలంకరించిన ఊయలలో బంగారు ఉత్సవ విగ్రహంతో స్వామివారి జన్మదిన వేడుకలను ఆలయ ఈవో ప్రభు, ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారి జన్మదిన వేడుకలు జరిపించారు. సాయంత్రం భక్తులకు మహా అన్నదాన ప్రసాదం చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్ల బండ్ల తో ఘనంగా స్వామివారి ఆలయం చుట్టూరా ఊరేగింపు జరిపారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో ఒగ్గు కథ నిర్వహిస్తారు. అంతేగాక రాత్రి స్వామివారి రథోత్సవము ఇరు గ్రామాల లోని ప్రధాన పుర వీధుల గుండా ఊరేగింపును నిర్వహించి అనంతరం దక్షయజ్ఞము అగ్నిగుండము లు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి బుర్ల ప్రభు తెలిపారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు స్వచ్ఛంద సేవకులు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, సహాయ సహకారాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీకృష్ణ శర్మ, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ లక్ష్మణ్, ఆఫీస్ సబార్డినేటర్ నాగరాజు, భాను, ఆలయ సిబ్బంది. భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.