Take a fresh look at your lifestyle.

ఇసుక త్రవ్వకాలు,భారీగా జీరో ఇసుక దందా……

0

హంగర్ గా మంజీరా వాగు నుంచి సుంకిని వాగు వరకు జోరుగా ఇసుక త్రవ్వకాలు

  • ఇసుక డంపు

  • భారీగా జీరో ఇసుక దందా

  • పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక తరలింపు అధిక రేట్లకు విక్రయింపు

  • చోద్యం చూస్తు…. పట్టించుకోని అధికారులు

  • ప్రకృతి వనరులు కాపాడడంలో అధికారులు విఫలమంటూ జనం మండిపాటు

ఎడపల్లి , జనవరి 31  ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హంగర్ గా మంజీరా వాగు నుంచి సుంకిని మంజీరా వాగు వరకు అనగా హంగార్గా, కారేగాం, హుమనాపూర్, ఈ గ్రామాల మంజీరా వాగు నుంచి ఈ ప్రధాన రహదారుల గుండా ప్రతిరోజు వివిధ మండలాలు వివిధ గ్రామాలకు ఇసుక ప్రత్యేక వాహనాలలో అధిక లోడుతో అతివేగంతో జీరో దందా తో ఇసుక భారీగా తరలింపు చేస్తూ విక్రయాలు, అధికరేట్లకు చేస్తూ ఉన్నారని దీనిపై పర్యవేక్షణ చేయవలసిన అధికారులు చోద్యం చేస్తున్నారని అటువైపు కన్నెత్తి చూడడం లేదని మామూళ్ల మత్తులో ములుగుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక దందా జోరుగా జరుగుతున్నప్పటికీ అటువైపు ఎందుకు కన్నితి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు, ప్రకృతి వనరులను అదేవిధంగా వాల్టా చట్టాన్ని కాపడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారని ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.