Take a fresh look at your lifestyle.

ఈనెల 24 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు నిర్వహణ…..

0

ఈనెల 24 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు నిర్వహణ

– జిల్లా విద్యాశాఖ అధికారి రాజు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు )  : డ్రాయింగ్ లోయర్ గ్రేడ్24 నుంచి 27 వరకు ఉదయం పది గంటల నుంచి 12:30 గంటల వరకు, హయ్యర్ గ్రేడ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటలకు నిర్వహిస్తామన్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ పరీక్ష 25 నుంచి 27 వరకు ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు హయ్యర్ గ్రేడ్ పరీక్ష రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతోందని చెప్పారు. అభ్యర్థులు హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి విద్యార్థి పేరు, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పెన్సిల్, కలర్స్, పరీక్ష అట్టలు ఇతర సామాగ్రి వెంట తెచ్చుకోవాలని చెప్పారు. టైలరింగ్ ఎంబ్రాయిడరీ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కుట్టుమిషన్లు, టేబుల్, కత్తెర సామాగ్రిని వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.