Take a fresh look at your lifestyle.

ఇక బీఆర్ఎస్ ఆటమొదలైంది….

0

ఇక బీఆర్ఎస్ ఆటమొదలైంది

 

– ఇక కాంగ్రెస్, బీజేపీలను వెంటాడుతాం

– మోడీ కుళ్లును, ఈడీ జైళ్లను ఢీకొట్టిన ధీశాలి కవిత

– కాంగ్రెస్ వి కక్ష సాధింపులు 

– బీజేపీవి రాజకీయ వేధింపులు

– పరాయి, కిరాయి పార్టీల బెదిరింపు లకు బీఆర్ఎస్ భయపడదు

– కాంగ్రెస్ అంటేనే చీటర్స్ గుంపు

– కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్ క్యాంపు

– కేటీఆర్,కవిత, హరీష్ రావు లు రేవంత్ రెడ్డి లాగా తెలంగాణ ఉద్యమం పై తుపాకీ ఎక్కుపెట్టి రాలేదు

– వారు తెలంగాణ పొరుగడ్డపై పుట్టిన ఉద్యమ బిడ్డలు

– కాంగ్రెస్ కు అధికారం తెలంగాణకు అంధకారం 

– రేవంత్ పాలన ప్రజలకు శాపం

– ఇందిరమ్మ రాజ్య మంటేనే అణచివేత,అవినీతి రోత, అబద్దాల మోత

– కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం

– అడ్డూఅదుపు లేని అప్పులు, హద్దుమీరిన తప్పులు

– దేవుళ్లపై ఒట్లు,ఆరు గ్యారెంటీలకు తూట్లు, కేసీఆర్ కు తిట్లు

– అమలుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు

– రెచ్చిపోతున్న కేడీలు

– రైతుల చేతులకు బేడీలు

– పేల్చివేతలు, కాల్చి వేతలే కాంగ్రెస్ విధానామా?

– ఇందిరమ్మ రాజ్యమంటే హింసాధ్వంసమేనా?

– ప్రజాపాలనంటే అబద్దాలు, అవినీతి, అరాచకాలా?

– ఇక సహించేది లేదు..సర్కారు పై పోరాడుతాం

– బీఆర్ఎస్ ది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం

– రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కేసీఆర్ ఆరాటం

– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్, డిసెంబర్29 ( లోకంతీరు ) : బీఆర్ఎస్ ఆటమొదలైంది, ఇక కాంగ్రెస్, బీజేపీలను వెంటాడుతాం అనిబీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు.రాజకీయ కుట్రలలో భాగంగా అక్రమ కేసులో అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన తర్వాత తొలిసారి ఆదివారం నిజామాబాద్ నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా

డిచ్ పల్లి నుంచి సుభాష్ నగర్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో అగ్రభాగాన పాల్గొన్న కవితకు పార్టీ జిల్లా శాఖ తరపున జీవన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ కుళ్లును, ఈడీ జైళ్లను ఢీకొట్టిన ధీశాలి కవిత అని అభివర్ణించారు.

‘కాంగ్రెస్ వి కక్ష సాధింపులు.

బీజేపీవి రాజకీయ వేధింపులు.

పరాయి బీజేపీ, కిరాయి కాంగ్రెస్ పార్టీల బెదిరింపు లకు బీఆర్ఎస్ భయపడదు అని ఆయన హెచ్చరించారు.తమ రాజకీయ ప్రత్యర్థుల పాలిట కాంగ్రెస్, బీజేపీలు రాక్షస పార్టీలుగా మారాయని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న కవిత తెలంగాణ గడ్డ గర్వపడే యోధురాలని ఆయన పేర్కొన్నారు.మోడీ చేతిలో ఈడీ ప్రత్యర్థులను అణచివేసే అస్త్రంగా మారిందన్నారు.మోదీ కుటిల రాజకీయాలను, ఈడీ, ఐటీలను ధైర్యంగా ఎదుర్కొంటున్న కవిత అన్ని కుట్రలను భగ్నం చేసి కడిగిన ముత్యంలా ప్రజలముందుకొస్తారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే చీటర్స్ గుంపు.

కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్ క్యాంపు. కేటీఆర్,కవిత, హరీష్ రావు లు రేవంత్ రెడ్డి లాగా తెలంగాణ ఉద్యమం పై తుపాకీ ఎక్కుపెట్టి రాలేదు.వారు తెలంగాణ పొరుగడ్డపై పుట్టిన ఉద్యమ బిడ్డలు’ అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ కు అధికారం రావడం వల్ల తెలంగాణ అంధకారబంధురమైందన్నారు.ఇందిరమ్మ రాజ్య మంటేనే అణచివేత,అవినీతి రోత, అబద్దాల మోత అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ఏడాది పాలనలో గర్వకారణం ఏమున్నదని? ఆయన నిలదీశారు.అడ్డూ అదుపు లేని అప్పులు, హద్దుమీరిన తప్పులు తప్ప ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ఘన కార్యాలేమీ లేవన్నారు.

ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.

దేవుళ్లపై ఒట్లు,ఆరు గ్యారెంటీలకు తూట్లు, కేసీఆర్ కు తిట్లు అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో కేడీలురెచ్చిపోతున్నారని, తమ భూములు లాక్కోవద్దని వేడుకుంటున్న

రైతుల చేతులకు బేడీలు వేసి జైళ్లపాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్లరాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని,తెలంగాణ పరువును గంగలో కలుపు తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ రాజ్యమంటే హింసా ధ్వంసమేనా? అని ఆయన ప్రశ్నించారు.ప్రజాపాలనంటే అబద్దాలు, అవినీతి, అరాచకాలా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే రామాయణమంత అని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు ఏం చేస్తున్నారో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.కాంగ్రెస్ నేరమయ పాలనను ఇక సహించేది లేదని, రేవంత్ సర్కారు పై ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన హెచ్చరించారు.

బీఆర్ఎస్ ది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటమన్నారు.రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే కేసీఆర్ ఆరాటమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ కాలకేయ రాక్షస పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సాగిస్తున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరులో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కదం తొక్కాలని జీవన్ రెడ్డి పిలుపు నిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.