Take a fresh look at your lifestyle.

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం….

0

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

కామారెడ్డి జిల్లా , జూలై 30 ( లోకంతీరు ) : ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్బంగా కామారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులకీ అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ లో విద్యార్థులకు మానవ అక్రమ రవాణా పోలీస్ విభాగం, కామారెడ్డి పోలీస్ కళాబృందం, సాధన సంస్థల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కానిస్టేబుల్ రాజేందర్ మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా అనేది భారతదేశంలో మూడవ అతిపెద్ద వ్యాపారంగా ఉందని మనుషులను అక్రమ రవాణా చేసి ఈ రకాల కార్యక్రమాలకు వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు అమ్మేస్తారని, మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం అమాయకంగా ఉన్నట్టయితే అక్రమ రవాణా గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. అపరిచిత వ్యక్తులు ఎటువంటి తిను బండారాలు ఇచ్చిన వాటిని తినకూడదని, అలాగే ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా తెలిస్తే వెంటనే పోలీస్ వారిని సంప్రదించాలని తెలియజేసారు. అనంతరం సాధన సంస్థ కో ఆర్డినేటర్ కొప్పుల రవి మాట్లాడుతూ పిల్లలు అక్రమ రవాణాకు గురయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అక్రమ రవాణాకు గురైనటువంటి పిల్లల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందని, మనం అపరిచిత వ్యక్తులతో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధన సంస్థ బాల్య వివాహాలు, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, పిల్లలపై హింస వేధింపులు అనే అంశాల పై కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తుందన్నారు. చైల్డ్ మ్యారేజ్ గురించి అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలలోపు అమ్మాయికి 21 సంవత్సరాలలోపు అబ్బాయికి పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. అలా పెళ్లి చేసినట్లయితే తగిన చర్యలు తీసుకోబడతాయి. పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేసారు. అటువంటి సమాచారం ఏమైనా తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ 112 లేదా 100 కి కాల్ చేసి సమాచారం అందించగలరని తెలిపారు. అనంతరం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం కానిస్టేబుల్ ప్రభాకర్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ వలన జరుగుతున్నటువంటి ప్రమాదాల బారి నుండి ఎలాగా మనల్ని మనం కాపాడుకోవాలనే విషయాలని విద్యార్థులకు చెప్తూ సమాజంలో మూఢనమ్మకాలు ఎక్కువ అవుతున్నందున ఆ మూఢనమ్మకాలను ఏ విధంగా నమ్మకూడదో కొన్ని ఉదాహరణలు ద్వారా విద్యార్థులకు తెలియజేశారు. అలాగే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజి ఇంచార్జ్ ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ ప్రపంచ మానవ అక్రమ రవాణా రోజున మా పాఠశాల కళాశాలలో ఇక నిర్వహించి మా విద్యార్థులకు అవసరమైన విషయాలపై అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా పిల్లలు అన్ని విషయాలు చురుగ్గా ఉంటారని, ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఏ హెచ్ టి యు రాజేందర్, పోలీస్ కళాబృందం కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు, సాధన సంస్థ కోఆర్డినేటర్ కొప్పుల రవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సోషల్ వర్క్స్ స్టూడెంట్స్ అలాగే విద్యార్థినిలు, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.