Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్….

0

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

– మాజీ సీఎం కేసిఆర్ కూతురు కవిత అరెస్ట్ 

– ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు వెల్లడి

– సుమారుగా నాలుగు గంటల పాటుగా కవిత ఇంట్లో ఈడి సోదాలు

కామారెడ్డి జిల్లా, మార్చి 15 ( లోకంతీరు) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. శుక్రవారం ఈడి ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్  బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తోంది. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైన ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ క్రమంలో కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు సమాచారం. మరోవైపు, కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 

మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు సంస్థల ముందు ఆమె విచారణకు హాజరవ్వాలా.. వద్దా.. అనే దానిపై ఆ రోజు విచారణ కీలకంగా మారనుంది.

Leave A Reply

Your email address will not be published.