Take a fresh look at your lifestyle.

రాజా బహదూర్ వెంకట రామారెడ్డి సేవలు భవిష్యత్తుకు పునాది….

0

రాజా బహదూర్ వెంకట రామారెడ్డి సేవలు భవిష్యత్తుకు పునాది

  • IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవిత రెడ్డి

నిజామాబాద్  , ఆగష్టు 22 ( లోకంతీరు న్యూస్ ) : విద్యా వ్యాప్తి, మహిళా అభ్యున్నతి, సామాజిక సేవా రంగాల్లో కొత్వాల్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవిత రెడ్డి* పేర్కొన్నారు. ఆయన 157వ జయంతి సందర్భంగా శనివారం నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ మహానీయుల పార్కులో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవిత రెడ్డి రాజా బహదూర్ వెంకట రామారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ నిజాం కాలంలోనే విద్యా వ్యాప్తికి, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి వెంకట రామారెడ్డి విశేషంగా కృషి చేశారని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్వాల్‌గా బాధ్యతలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.హైదరాబాద్‌లో ఆయన కృషితో ఏర్పాటైన రెడ్డి హాస్టల్, మహిళా విద్యాసంస్థలు నేటికీ ఎంతోమందికి విద్యావకాశాలు కల్పిస్తూ ఆయన సేవలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించిన కారణజన్ముడు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి అని అన్నారు.విశిష్ట అతిథిగా హాజరైన పట్టోళ్ల శంకర్ రెడ్డి మాట్లాడుతూ వెంకట రామారెడ్డి విద్యారంగంతో పాటు సేవా రంగంలోనూ తనదైన ముద్ర వేశారని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేసిన మహనీయుడని పేర్కొన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాయిరెడ్డి మాట్లాడుతూ నిజాం కాలంలోనే మహిళలు చదువుకోవాలనే సంకల్పంతో మహిళా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల ఏర్పాటుకు కృషి చేసిన ఘనత రాజా బహదూర్ వెంకట రామారెడ్డికి దక్కుతుందని అన్నారు. ఆయన స్ఫూర్తితో నిజామాబాద్‌లోనూ మహిళా విద్యాభివృద్ధికి పలువురు ప్రముఖులు విద్యాసంస్థలను ఏర్పాటు చేసి వేలాది మంది మహిళలు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేశారని తెలిపారు. వెంకట రామారెడ్డి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జీపీఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంత రెడ్డి దేవేందర్ రెడ్డి, మల్లేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, బి.వి. గోపీనాథ్ రెడ్డి తదితరులతో పాటు జిల్లాలోని వివిధ రెడ్డి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.