Take a fresh look at your lifestyle.

పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేలు బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి….

0

పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేలు బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

ఆర్మూర్,జులై 25 ( లోకంతీరు ) : స్వయంగా ప్రధాన మంత్రి తో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి లు పసుపు బోర్డు కు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని, మొన్నటి యూనియన్ బడ్జెట్ లో నిధుల గురించి ప్రస్తావన లేకపోవడం జిల్లా రైతులకు తీవ్ర నిరాశ కలిగించింది అని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ జిల్లా బీజేపీ నాయకులు ఎంపీ, ఎంఎల్ఏ లు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతారని అసెంబ్లీ తో పాటు, పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే జిల్లా ప్రజలకు వారు చేసింది గుండు సున్నా అని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు తిరుగుబాటు చేయకముందే జిల్లా అభివృద్ధికి, పసుపు బోర్డు ఏర్పాటుకు తగిన నిదులు మంజూరు చేసే విధంగా బీజేపీ అగ్ర నాయకత్వం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.