Take a fresh look at your lifestyle.

ఊరూరా పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించాలి….

0

ఊరూరా పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించాలి

– జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 17 ( లోకంతీరు ) : ఊరూరా సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 18న రాష్ట్ర పండగ సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు వట్టికూడి రామారావు గౌడ్ ఘనతనేనని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో బహుజన పోరాట యోధుడు, విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి గౌడ ఐక్యత చాటాలన్నారు. భావితరాలకి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాలలో ముద్రించి సర్దార్ పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకొని బహుజనులు ముందుకు సాగాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.