మూడో కల్లు డిపో పై ఎక్సయిజ్ శాఖ కు మురిపెం ఎందుకో?
-
జులై 26 న తీసిన ఆ కల్లు శాంపిల్స్ ఏమయ్యాయి
-
శాంపిల్స్ సేకరణలో వీడియోలు ఎందుకు మరిచారు
-
గుట్టు చప్పుడు కాకుండా శాంపిల్స్ ను మార్చారనే వినికిడి
-
ఆ ఎక్సైజ్ అధికారికి ఆ డైరెక్టర్ కు మధ్య ఉన్న బంధం ఏమిటి

నిజామాబాద్, ఆగస్టు 17 (లోకంతీరు) : అక్రమాల బంధం అల్లుకుంది అన్నట్టు… నిజమాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో నిర్వాహకులకు ఎక్సయిజ్ శాఖ మధ్య అవినీతి ప్రేమ బంధం పెనవేసుకుందనే విమర్శలు ఆగడం లేదు. మూడో కల్లు డిపోపై అనేక పిర్యాదులు అందినా, శాఖ పరమైన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంటూ గీత కార్మికులు గుసగుసలు పెడుతున్నారు. గత నెల రోజులుగా మూడవ కల్లు సోసైటీ అక్రమాలపై కలెక్టర్ కు జులై నెల 8, 22, ఆగస్ట్ నెల 12 తేదీలలో ప్రజావాణిలో,ఆగస్ట్ 6న డిప్యూటీ కమిషనర్ కు ఎక్సయిజ్ సుపరిండెంట్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసిన
ఎక్సయిజ్ శాఖ అధికారుల్లో ఏమాత్రం చలనం లేకపోవడం కార్మికుల అనుమానాలను బల పరుస్తోంది. గత కొద్దిరోజుల క్రితం ఈ డిపోలో నుండి సేకరించిన కల్లు శాంపిల్స్ ఏమయ్యాయని వాటిని హైదరాబాద్ ల్యాబ్ కు పంపిచార లేదా అదే రోజు మధ్యాహ్నం నిజమాబాద్ ఎస్ హెచ్ వో కార్యాలయంలో, సాయంత్రం ఎక్సయిజ్ సుపరిండెంట్ ఆఫీస్ లో సైతం
మూడో డిపోలో అన్ని తానై నడిపిస్తున్న యువరాజు,అతని సైన్యం ఉండటం వెనుక మతలబు ఏమిటి అనే ప్రశ్న ప్రస్తుతం నెలకొంది. ఆ రోజు మధ్యాహ్నం అబ్కారీ ఎస్ హెచ్ వో ను కలిసిన తరువాత ఏమి జరిగిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. లేదా ఇక్కడే రసాయనాలు కలిపిన కల్లు శాంపిల్స్ ను మార్చారా?
మత్తు కల్లు శాంపిల్స్ ను మార్చి మాములు కల్లు శాంపిల్స్ ను పెట్టారా? అనేది అనుమానాలకు తావిస్తుంది.
అనుమానాలన్నీ నిజమేనా
జులై 26 తేదీరోజున
ఆ కల్లు శాంపిల్స్ ను సేకరించే ముందు వీడియో చిత్రీకరణ ఎందుకు తీయలేదు. ఆరోజు
మధ్యాహ్నం ఎస్ హెచ్ వో ఆఫీసులో రెండు గంటలపాటు డిపో యజమానులు ఏమి మాట్లాడారు ఆ శాంపిల్స్ ఏమయ్యాయ్యె అనేది
ప్రశ్నార్థకంగా మారింది,
ఆ డిపో పై ఏమైనా కేసులు నమోదు చేసారా? చేసినచో ఎందుకు బయటకు రాకుండా ఎస్ హెచ్ వో జాగ్రత్త వహిస్తున్నారనేది విమర్శలకు తావిస్తోంది. ఈ నిజమాబాద్ ఎస్ హెచ్ వో ఈ డిపో చెందిన ఓ కల్లు దుకాణంపై దాడి చేసి రూ.39,000 లిక్కర్ ను పట్టుకుని వదిలివేశారని, విషయం బయటకు పొక్కడంతో వారం రోజుల తరువాత కేసు నమోదు చేశారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ పట్టు బడిన షాప్ మూసివేయకుండా వారం పాటు ఎందుకు తాత్సరం చేశారు, మళ్ళీ పై అధికారులకు ఒత్తిడి తో దుకాణం ముసివేశారు, అంటే ఈ డిపో పట్ల ఎక్సయిజ్ అధికారుల ప్రేమ, సహకారం ఏస్థాయిలో ఉందో కనబడుతోంది, మూడో కల్లు డిపోలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ దృష్టి సారించాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పౌర సమాజం ఆశిస్తుంది.