Take a fresh look at your lifestyle.

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి….

0

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లా ,ఆగస్టు 23 (లోకంతీరు) : ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఎల్ఆర్ఎస్ విధానాన్ని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారికి ముందస్తు సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లాలని అధికారులకు సూచించారు. సర్వే నంబర్, ప్లాట్ నెంబర్, రోడ్డు విస్తరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. పరిశీలనలో స్థలం ప్రభుత్వానిదా, ప్రైవేటుదా అనేది నిర్ధారించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, తహసీల్దార్ వరప్రసాద్, ఇరిగేషన్ ఏఈ గజానంద్, ఎంపీడీవో బషీరుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.