అరిగోస పడుతున్న డబల్ బెడ్ రూమ్ బాధితులు

ఎడపల్లి, జూలై 30 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల తానాకాలన్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న జనాలు అరిగోస పడుతున్నారు. వివరాల్లోకెళ్తే తానాకాలన్ గ్రామంలోనీ డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న జనాలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ పక్కనుండే వెళ్తున్న 11/ కెవి పవర్ సప్లై వెళ్తున్నప్పటికీ డబుల్ బెడ్ రూమ్ లోకి మాటకు ఇప్పటివరకు పవర్ సప్లై ఇవ్వడం లేదు అంతేకాకుండా తాగడానికి నీరు సైతం లేకుండా ఆ డబ్బులు బెడ్రూంలో నివాసం ఉంటున్నారు జనాలు, చిన్నపిల్లలు సైతం నివాసం ఉంటున్న డబుల్ బెడ్ రూమ్ లో వర్షాకాలంలో దోమల బెడదెబ్బలతో జ్వరాలకు విష జ్వరాలకు గురవుతున్నారు. భూమి, స్థలాలు, ఇండ్లు లేకుండా పేదరికంలో మగుతున్న జనాలు డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉండగా వాళ్లని ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యుత్ దీపాలతో పాటుతాగునీరు సైతం లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారుఇకనైనా అధికారులు వారి బాధలను దృష్టిలో పెట్టుకొని అక్కడే ఉన్న 11/ కెవి లైన్లో నుంచి వారికి విద్యుత్ సమకూర్చాలని అలాగే అక్కడే ఉన్న బోర్ మోటార్ నుంచి వారికి నీరు సైతం సమకూర్చాలని, వారు అధికారులను కోరుతున్నారు. 12వ తారీకు రెవెన్యూ సదస్సులో భాగంగా ఎమ్మార్వో తానాకాలన్ గ్రామంలోకి రావడం జరుగుతుందని తెలుసుకున్న డబుల్ బెడ్ రూమ్ నివాసులు ఎమ్మార్వో ని డబుల్ బెడ్ రూమ్ లను సందర్శించి వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని వాళ్లు కోరుతున్నారు