Take a fresh look at your lifestyle.

నిరాశ్రయులకు అన్నదానం….

0

నిరాశ్రయులకు అన్నదానం 

— వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో 

రామారెడ్డి, సెప్టెంబర్ 3 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు మనో ధైర్యాన్ని కల్పిస్తూ, పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు మంగళవారం మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజనం వడ్డించడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సామాజిక స్ఫూర్తితో ప్రతి ఒక్క యువత,నాయకులు ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని వివేకానంద ట్రస్టు సభ్యులు తెలిపారు. మునుముందు సామాజిక సేవలో ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు ప్రజా శ్రేయస్సు కొరకు కొనసాగించడం జరుగుతుందని ఆ సంస్థ నిర్వాహకులు అన్నారు. బయట కుటుంబాలు వారికి అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.