నగరంలో మిల్క్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్, ఆగస్టు 12 ( లోకంతీరు న్యూస్ ): నిజామాబాద్ నగరంలో మిల్క్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కల్తీపై అవగాహన మరియు తక్షణ పరీక్షల నిర్వహణ లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నవిత సమక్షంలో పలు మిల్క్ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా పాలు, పెరుగు, పన్నీరు, నెయ్యి తదితర పాల ఉత్పత్తుల నమూనాలను సేకరించి నాణ్యత నిర్ధారణ కోసం రాపిడ్ టెస్టులను నిర్వహించడం జరిగిందని పుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నవిత తెలిపారు.గతంలోనూ నగరంలోని పలు పాల బూత్‌లపై తనిఖీలు నిర్వహించి నమూనాలు తీసుకొని తక్షణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.ప్రయోగశాల పరీక్షల్లో పాల ఉత్పత్తుల్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత నిర్వాహకులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాల ఉత్పత్తుల నాణ్యతపై తనిఖీలను మరింత విస్తృతం చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.ఈ తనిఖీలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ జి. నవిత, ల్యాబ్ టెక్నీషియన్ బి. తిరుపతి, శాంపిల్ అసిస్టెంట్ సాయి కృష్ణ, డ్రైవర్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.