Take a fresh look at your lifestyle.

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్….

0

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 06 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును కొనసాగిస్తుండడాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.