ద్వితీయ బహుమతి పొందిన జిల్లా వాసి

కామారెడ్డి జిల్లా, జనవరి 18 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సోనాలిక ట్రాక్టర్ షో రూమ్ లో జువ్వాడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు సోనాలిక ట్రాక్టర్ ను దసరా, దీపావళి ఆఫర్ లో కొనుగోలు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోనాలిక షో రూమ్ లలో లక్కీ డ్రా లో కామారెడ్డి జిల్లా వాసికి ద్వితీయ బహుమతిగా కారు డ్రాలో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా సిరిసిల్ల రోడ్ లోని షో రూమ్ మేనేజింగ్ డైరెక్టర్ జె సుధాకర్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ బి శంకర్ జువ్వాడి గ్రామస్తుడు లకిడే లక్ష్మణరావు టాటా పంచ్ కారు గెలుపొందినందుకు కారు యొక్క తాళాలు అందజేసి, శాలువాతో సన్మానం చేసారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు కారును గెలుపొందినందుకు చాలా సంతోషం వ్యక్తం చేసారు.