టీపీసీసీ ని కలిసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
-
ఈసన్నపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు
![]()
కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లోనీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని తెలంగాణ గాంధీ భవనంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానం చేయడం జరిగింది. అలాగే శ్రీ భైరవ స్వామి ఫోటో అందజేశారు. దక్షిణ కాశీగా పిలవబ పడుకున్న పుణ్యక్షేత్రం శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ కి రమ్మని ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కొద్ది రోజుల్లో ఇసన్నపల్లికి వస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసన్నపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ బైరు యాదవ్, కందూరి లింబాద్రి, చింతల రవీందర్ ముదిరాజ్,తుమ్మల రమేష్ యాదవ్,దోమకొండ రాజు యాదవ్, చెట్టుపల్లి బైరు, రెడ్డి మైపాల్,రెడ్డి పేట బాలయ్య,బంటు రాజేందర్ దండే బోయిన సతీష్,ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
