
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) :
బెల్లంపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి సోమవారం ఉదయం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ పెద్దనపల్లి గ్రామంలోని అహ్మద్ అలీ నివసిస్తున్న ఇల్లు కూలింది.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ ఇంటిని స్థానిక మున్సిపాలిటీ అధికారులు పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని సూచించారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెల్లికంటి శ్రీధర్ కూలిన ఇంటిని పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.