Take a fresh look at your lifestyle.

అంతరించిపోతున్న అటవి సంపద…..

0

అంతరించిపోతున్న అటవి సంపద….?

— జోరుగా అటవీ భూముల ఆక్రమణ..?

– అటవీశాఖ అధికారుల అండదండలతో..?

— సమాచారం ఇవ్వడానికి ముందుకు రాని అధికారులు?

ఉమ్మడి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : అడవులను రక్షించే రక్షకులు భక్షించే వారిగా మారిపోయారు.నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాకులు దూరని కార అడవులుగా పేరుగాంచాయి. ప్రస్తుతం అటవీ శాఖలో పని చేస్తే కొంత మంది అటవీశాఖ అధికారులు అడవులను అమ్మేస్తున్నారు.? దర్జాగా అటవీశాఖ అధికారుల అండదండలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అడవులు అంతరించిపోయి చిట్టడివిగా మారిపోతున్నాయి.ఉమ్మడి కామారెడ్డి జిల్లా అటవీ శాఖ పరిధిలో పెద్ద ఎత్తున అడవులు నరికివేతకు గురవుతున్నాయి. కొంతమంది అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు అందుకొని అడవులను వారికి అమ్మేస్తున్నారు. దీని ఫలితం అడవులపై ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు కంటి చూపు మేర పచ్చదనంతో కనిపించే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని అడుగులు ప్రస్తుతం ఎక్కడ చూసినా కొండలు, గుట్టలు, భూములు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పర్యావరణం పై ప్రభావం చూపితే ఇటీవల జరిగిన కేరళలోని సంఘటనలే నిదర్శనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకవైపు కొండలు, మరొకవైపు గుట్టలు, ఇంకొక వైపు ఇసుక, అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గత గులాబీ ప్రభుత్వం లో కేవలం కామారెడ్డి జిల్లాలో హరితహారం లో భాగంగా 70 కోట్ల మొక్కలు నాటినట్లు అధికార రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ ప్రస్తుతం మొక్కలు ఎన్ని నాటారు? ఎన్ని నిధులు మింగేశారు? ఆ అధికారులకే తెలియాలి. గులాబీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వన మహోత్సవం పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటికోసం బడ్జెట్లో కోట్లు వెచ్చించారు. కానీ ఏమి లాభం ఉన్న అడవులను కాపాడుకుంటే అదే 10,000 మొక్కలు అని చెప్పుకోవచ్చు. ఒక్క మొక్క నాటితే 100 మొక్కలు నరికివేతకు గురవుతున్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సుమారుగా 10 వేల ఎకరాల అటవీ భూములు ఆక్రమించుకున్నట్లు అధికార రికార్డులు వెల్లడిస్తున్నాయి.? ఇంకా ఇప్పటికి ముదిల్లి, గౌరారం, గండిపేట్, సింగీతం, భవానిపేట్ ప్రాంతంలో అడవుల నరికివేత జోరుగా సాగుతుంది. తమ గ్రామ శివారులోని తమ అడవులను తామే రక్షించుకుంటామని గౌరారం గ్రామస్తులు తీర్మానం చేసుకుని అటవీశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, గౌరారం అటవీ ప్రాంతంలో అడవుల నరికివేత ఏదేచ్ఛంగా కొనసాగుతుంది. ఓ గిరిజన నాయకుడు ఏకంగా 50 ఎకరాల అడవులను నరికివేసి దర్జాగా బోరు వేసుకొని పంటలు పండించుకుంటున్నారు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే మీటర్ కట్టడానికి సవా లక్ష కొర్రీలు పెట్టే అటవీశాఖ అధికారులు, గౌరారం అడవులను నరికివేసి భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ బోర్లు వేసుకుని పంటలు వేసుకుంటుంటే వారికి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్తు తీగలు అమర్చి వారికి అండగా నిలుస్తున్నారు ట్రాన్స్కో శాఖకు చెందిన కొంతమంది అధికారులు. ప్రభుత్వ భూముల్లో పంటలు పండించుకుంటే వారికి విద్యుత్ సౌకర్యం కల్పించకూడదని నిబంధన ఉన్నప్పటికీ, గౌరారం శివారులోని అటవీ ప్రాంతంలో సుమారుగా ఇప్పటివరకు 300 ఎకరాలపైగా నరికివేతకు గురి అయింది. ఇంకా అడవుల నరికివేత కొనసాగుతూనే ఉంది. తమ అడవులను తాము రక్షించుకుంటాం అని గ్రామస్తులు ముందుకు వస్తే వారిని లెక్కచేయకుండా అటవీ శాఖ అధికారులు, అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్న వారితో చేతులు కలుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి అటవీ ప్రాంతంలో జోరుగా అడవుల నరికివేత కొనసాగుతుంది. వర్ని అటవీ శాఖలో పనిచేసే కొంతమంది అధికారులు ముడుపులు అందుకొని దర్జాగా అడవుల నరికివేతకు సహకరిస్తున్నారు. గాంధారి, బాన్సువాడ, పిట్లం, వర్ని ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్ద ఎత్తున అటవీ భూముల ఆక్రమణ కొనసాగుతుంటే అడవులను రక్షించవలసిన అటవీశాఖ అధికారులు భక్షించే అధికారులుగా మారిపోయారు. గౌరారం అటవీ ప్రాంతంలో దర్జాగా కళ్ళముందే అడవులను నరికి వేస్తుంటే అటవీశాఖ అధికారులు , అటవీ భూములను ఆక్రమించుకుంటున్న వారితో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సంబంధిత శాఖ ఉన్నత అధికారులకు వివరణ కోరడానికి రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారు స్పందించకపోవడం పట్ల వారి పనితీరుపై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అని మేధావి వర్గం భావిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.