రాష్ట్రంలో డిఎస్సి లో మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థికి సన్మానం

కామారెడ్డి జిల్లా , నవంబర్ 03 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సిలో మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్యాద పూర్వకంగా ఆదివారం కలిసారు. ఎస్ జి టి. డీఎస్సీ పరీక్షలో రాష్ట్ర మరియు జిల్లా మొదటి ర్యాంకు సాధించిన జిల్లా అభ్యర్థిని శాలువాతో షబ్బీర్ అలీ సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ 2024 ఫలితాల్లో ఎస్జీటీ (తెలుగు) విభాగంలో తొలి ప్రయత్నంలోనే పిట్లం మండలం మర్దండా గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక 88.77 మార్కులు సాధించి కామారెడ్డి జిల్లా స్థాయిలో తొలి ర్యాంక్ సాధించింది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఎస్జీటీ (తెలుగు) విభాగంలో టాప్ స్కోరర్ గా నిలిచింది. ప్రస్తుతం కామారెడ్డి మండలంలోని షాబ్దిపూర్ తండా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్ జి టి తెలుగు) గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీనిను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీ షబ్బీర్ కోటగిరి మౌనిక ను సన్మానించి, పాఠశాల విద్యార్థులకు మంచి విద్యను బోధించి, విద్యార్థుల భవిష్యత్తుకి మార్గ నిర్దేశం చేసి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేలా చేసి, జిల్లాకి, రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.