సన్మాన సభకు భారీగా తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు


స్వచ్ఛందంగా బస్సులో బయలుదేరిన మహిళలు
ఎడపల్లి, నవంబర్ 13( లోకంతీరు ) : ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు మండలం నుంచి ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు బయలుదేరారు.జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సన్మాన సభకు ఎడపల్లి మండలం నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.