జానకంపేట్ బోధన్ మధ్య రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత
– వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణ సూచన. . .

ఎడపల్లి, జూలై 29 ( లోకంతీరు ) : జానకంపేట్ బోధన్ మధ్య రైల్వే లైన్ మరమ్మత్తుల నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు జులై 30 అర్ధరాత్రి 12 గంటల నుండి జూలై 31 రాత్రి 11 గంటల వరకు రైల్వే లైన్ కు అనుసంధానమైన గేటును తాత్కాలికంగా మూసివేస్తామని తెలిపారు ఈ సమయంలో ఎడపల్లి బోధన్ మరియు సాతాపూర్ గేట్ జైతాపూర్ పోచారం గ్రామాలకు వెళ్లే రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నారు ప్రయాణాల్లో అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు ఈ మరమ్మత్తుల పనులకు సహకరించాలని రైల్వే శాఖ వాహనదారులకు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఇందుకు సంబంధించిన సమాచారం సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులకు ముందుగానే చేరవేయబడినట్లు వెల్లడించారు ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం అందజేయడం జరిగింది