నారాయణ పాఠశాలలో ఘనంగా జోనల్ లెవల్ నారాయణ ప్రీమియర్ లీగ్ సంబరాలు

ఆర్మూర్, నవంబర్ 17 ( లోకంతీరు ) : నిర్మల్ పట్టణం లోని నారాయణ పాఠశాలలో జోనల్ లెవల్ నారాయణ ప్రీమియర్ లీగ్ సంబరాలు ఘనంగా జరుపుకున్నామనీ పాఠశాల ప్రిన్సిపల్ హర్షవర్ధని తెలిపారు. ఈ ప్రీమియర్ లీగ్ లో భాగంగా విద్యార్థులందరికి రకరకాల క్రీడలను నిర్వహించి అందులో విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందులో కోకో బాలురు మొదటి బహుమతి (ఆర్మూర్ బ్రాంచ్) రెండవ బహుమతి (నిజామాబాద్ బ్రాంచ్), కోకో బాలికలు మొదటి బహుమతి (ఆర్మూర్ బ్రాంచ్), రెండవ బహుమతి (నిర్మల్ బ్రాంచ్), కబడ్డీ బాలురు మొదటి బహుమతి (నిర్మల్ బ్రాంచ్), రెండవ బహుమతి (భైంసా బ్రాంచ్), కబడ్డీ బాలికలు మొదటి బహుమతి ( భైంసా ) బ్రాంచ్, రెండవ బహుమతి (ఆదిలాబాద్) బ్రాంచ్, వాలీబాల్ మొదటి బహుమతి (నిర్మల్ బ్రాంచ్), రెండవ బహుమతి( ఆర్మూర్ బ్రాంచ్), త్రోబాల్ మొదటి బహుమతి ( భైంసా బ్రాంచ్), రెండవ బహుమతి (ఆర్మూర్ బ్రాంచ్), క్యారమ్స్ బాలురు మొదటి బహుమతి( భైంసా బ్రాంచ్(, రెండవ బహుమతి (ఆదిలాబాద్ బ్రాంచ్), క్యారమ్స్ బాలికలు మొదటి బహుమతి( ఆర్మూర్ బ్రాంచ్), రెండవ బహుమతి (నిర్మల్ బ్రాంచ్), చెస్ బాలురు మొదటి బహుమతి (ఆర్మూర్ బ్రాంచ్), రెండవ బహుమతి (ఆదిలాబాద్ బ్రాంచ్), చెస్ బాలికలు మొదటి బహుమతి (నిజామాబాద్ బ్రాంచ్), రెండవ బహుమతి (ఆదిలాబాద్ బ్రాంచ్) లు విజేతలుగా నిలిచిన బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ నారాయణ విద్యాసంస్థల జి.యం గోపాలరెడ్డి ,యం.ఈ.ఓ నాగేశ్వర్, నిజామాబాద్ జోన్ ఏ.జి.యం. శివాజీ, ఆదిలాబాద్ జోన్ ఏ.జి.యం ప్రసాద్ పాల్గొని, నారాయణ విద్యాసంస్థలు చదువులోనే కాదు అన్ని రంగాలలో ముందుంటాయని తెలిపారు. విద్యార్థుల శారీరక ఎదుగుదలకు క్రీడలు అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ & ఆదిలాబాద్ జోనల పాఠశాలల కో.ఆర్డినేటర్స్ ప్రిన్సిపల్, ఏ.ఓ లు వ్యాయామ ఉపాధ్యాయులు మరియ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.