Take a fresh look at your lifestyle.

వీళ్ళిద్దరూ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే…….

0

వీళ్ళిద్దరూ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే…….

కాంగ్రెస్‌లోకి ఫిరాయించలేదు 

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో …

హైదరాబాద్, జనవరి 15  ( లోకంతీరు ) : పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేవెళ్ళ, బాన్సువాడ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య , పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్‌తోనే ఉన్నారని, కాంగ్రెస్‌లో చేరలేదని, వారిపై అనర్హత వేటు వేయడం వీలుపడదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. న్యాయస్థానాల ఆదేశాలతో స్పీకర్ సుదీర్ఘ విచారణ జరిపి గతంలో ఐదుగురిపై అనర్హత వేటు వేయలేమని తీర్పు ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజే వీరిద్దరిపైనా తీర్పును వెలువరించారు. కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్ఎస్‌తోనే ఉన్నారని తన తీర్పులో స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణ ఎమ్మెల్యే అనర్హత కేసు ముగిసినట్లయింది. ఎవ్వరూ డిస్‌క్వాలిఫై కాలేదు.

Leave A Reply

Your email address will not be published.