Take a fresh look at your lifestyle.

అమ్మ,నాన్నల స్ఫూర్తిగా రెండు ఉద్యోగాలు సాధించిన పల్లెటూరి యువతి….

0

అమ్మ,నాన్నల స్ఫూర్తిగా రెండు ఉద్యోగాలు సాధించిన పల్లెటూరి యువతి 

ఎల్లారెడ్డి, నవంబర్ 15 ( లోకంతీరు ) :  ఎల్లారెడ్డి మండలంలోని సబ్దల్ పూర్ గ్రామానికి చెందిన భయ్యని సుధాకర్, నిర్మల దంపతుల కూతురు భయ్యని శిరీషకు వరుసగా రెండు ఉద్యోగాలు సాధించింది. భయ్యని శిరీష తన అమ్మ,నాన్నల కష్టం చూసి బాగా చదివి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నట్లు శిరీష పేర్కొన్నారు. తండ్రి వ్యవసాయం చేస్తూ మేష్ట్రీ పని కూడా చేసేవాడని, తల్లి కూలీ పని చేసి కష్టపడి తనను చదివించారని వారి కష్టాన్ని వృధా చెయ్యకూడదని పట్టుదలతో చదివి వరుసగా రెండు ఉద్యోగాలకు ఎంపీక అయ్యానని, మొదట కానిస్టేబుల్ ఉద్యోగం సాధించగా, ప్రస్తుతం గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినట్లు శిరీష తెలిపింది. రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల శిరీష తల్లి దండ్రుల తోపాటు గ్రామస్తులు శభాష్ శిరీష అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.