Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి….

0

ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి

– ప్రైవేట్,కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి ~ PYL- POW డిమాండ్

నిజామాబాద్, నవంబర్ 23 ( లోకంతీరు ) :  ప్రగతిశీల యువజన సంఘం(PYL ),ప్రగతిశీల మహిళా సంఘం(POW) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రభుత్వ ఆసుపత్రి బలోపేతం చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే సంధ్యారాణి, యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య పరీక్ష సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల,ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీలతో వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఏరియా హాస్పిటల్ లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వాస్పిటల్స్ లో మౌలిక వసతులు కల్పించి డాక్టర్లకు నర్సులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడిని అరికట్టి, టెస్టుల మందుల పేర్లతో చేస్తున్న వసూళ్లను నియంత్రించాలి. అనవసరమైన ఆపరేషన్ చేయడాన్ని నియంత్రించాలని, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించే పి.ఆర్.ఓ సిస్టంను, మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ లపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు లలిత,అమూల్య, యువజన సంఘం డివిజన్ కార్యదర్శి దండు మహేష్ నాయకులు రాజు, మహిళా నాయకులు రజిత, అక్షయ, దేవిక, రాజశ్రీ, నరసవ్వ, బేగం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.