ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 23 (లోకంతీరు) : వేల్పూర్ మండలం రమన్నపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఇటి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ మంజూరైన చెక్కులు శనివారం పంపిణీ చేశారు. గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో సీఎంఆర్ చెక్కులు మంజూరు అని అన్నారు.లబ్ధిదారులు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి, సునీల్ కుమార్,కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రైతులకు క్వింటాల్ కు 500 రూ,బోనస్ ఇస్తున్న సందర్భంగా రామన్నపేట కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.