కుర్నాపల్లి గ్రామ ప్రజలు ఆశీర్వదించండి గ్రామఅభివృద్ధి ధ్యేయంగాపనిచేస్తా
-
దుబ్బాక రవీందర్ గౌడ్

ఎడపల్లి , డిసెంబర్ 05 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నందున తనను గ్రామస్తులు ఆదరించి మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని దుబ్బాక రవీందర్ గౌడ్ ఓటర్ల ను అభ్యర్థించారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన వెంట తాజా మాజీ సర్పంచ్ దుబ్బాక సావిత్రి,, స్థానిక నాయకులు కొండ సాయిలు, పరశురామ్ గౌడ్, విట్టల్ గౌడ్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.