మెడికల్ షాపులో చోరీ

ఆర్ముర్ ,డిసెంబర్ 11(లోకంతీరు): ఆర్మూర్ లో బుధవారం తెల్లవారు దొంగలు బీభత్సం సృష్టించారు. బస్టాండ్ సమీపంలోని ఓ మెడికల్ షాప్లో చోరీ చేశారు. ఉదయం 4 గంటలకు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ జరిగిన మెడికల్ షాప్ నుంచి సీసీ కెమెరా డివిఆర్ ను సైతం ఎత్తుకెళ్లారు.