మోహన్ బాబుకు వెంటనే అరెస్టు చేయాలి
– జర్నలిస్టుల డిమాండ్

నిజామాబాద్,డిసెంబర్ 11(లోకంతీరు): జర్నలిస్ట్ ల దాడి చేసిన మోహన్ బాబుకు వెంటనే అరెస్టు చేయాలని నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ మంచు మోహన్ బాబు ఆయన కుటుంబ సమస్యల మీద రాష్ట్రంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో మీడియా కవరేజ్ వెళ్లిన మీడియా ప్రతి నిధులపై జరిగిన దాడి నివసిస్తూ ఈరోజు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా,ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో నిరసన నిర్వహించడం జరిగిందన్నారు. సమాజంలో ప్రధానమైన ఫోర్త్ ఏ స్టేట్ గా పిలువడే జర్నలిస్టులు ప్రజలకు సమాచారం ఏప్పడి కప్పుడు తెలియజేసేందుకు కేవలం సమాచారం నిమిత్తం వెళ్లిన వారిపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం అన్నది దారుణం అన్నారు. జర్నలిస్టులు వాళ్ళు కేవలం వృత్తిపరంగా ఆయనను వివరణ కోరినందుకు ప్రయత్నించగా ఆయన మైక్ తో దాడి చేయడం చాలా సిగ్గుచేటని, ఎందుకంటే ఆయన నటుడుగాను కాకుండా ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేశారు. అప్పటినుంచి ఆయన ప్రవృ త్తి అన్నది చాలా రోజులుగా బదులుగానే ఉన్నారన్నారు. ఇప్పుడు కూడా ఆయన సొంత పిల్లల కుటుంబ సభ్యుల విషయంలో కేవలం వివరణ అడిగిన జర్నలిస్టుపై వ్యక్తిగతంగా దాడి చేసి దూషించడం అన్నది దారుణంఅన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఆయన ఒక నటుడు గానే కాకుండా ప్రజాస్వామ్యవాదిగా గతంలో ప్రజాప్రతినిగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ కావాలని ఆయన ఆవేశానికి లోనయ్యాడా వ్యక్తిగతంగా దాడి చేయడం అన్నది చాలా దారుణం. జర్నలిస్టులందరూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై ఉద్యమాలు ప్రారంభమయ్యాయిని వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు..