Take a fresh look at your lifestyle.

ఎస్బిఐ సర్వీస్ పాయింట్లో దొంగతనం….

0

ఎస్బిఐ సర్వీస్ పాయింట్ లో దొంగతనం


నిజామాబాద్ క్రైమ్ , నవంబర్ 24 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని పెద్దబజార్ నందు గల వాటర్ ట్యాంక్ దగ్గర గల ఎస్బిఐ, సర్వీస్ పాయింట్ నందు 17 వేల రూపాయల నగదు దొంగతనం చేయడం జరిగింది. ఈ యొక్క సర్వీస్ పాయింట్ ని కుందరపు రాహుల్ నడిపిస్తున్నాడు. రాహుల్ ఇచ్చిన వివరాల ప్రకారం బ్యాంకులు శని, ఆదివారాలు సెలవుల కారణంగా సర్వీస్ పాయింట్ మూసి వేయడం జరుగింది . కాబట్టి శుక్రవారం రోజున జరిగిన లావాదేవి లలో భాగంగా వచ్చిన 17వేల రూపాయలని తన యొక్క కౌంటర్ నందు ఉంచగా ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి తన యొక్క సర్వీస్ పాయింట్ ని చూద్దామని రాగా సర్వీస్ పాయింట్ లో వెలుగుతున్న లైట్లను చూసి అనుమానం వచ్చి చూడగా తన కౌంటర్ లో ఉన్న 17వేల రూపాయలు మాయమైపోయాయి. అప్పుడు అనుమానం వచ్చి చూడగా… ఓపెన్ చేసి ఉంచిన వెంటిలేటర్ లను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.