Take a fresh look at your lifestyle.

నిజమైన లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లు ….

0

నిజమైన లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లు 

– మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి 

కామారెడ్డి ప్రతినిధి, డిసెంబర్ 29 (లోకంతీరు) : నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇల్లు లేని వారికి, పూరి గుడిసెలో నివసించు వారికి, ఇల్లు దగ్ధమైన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించాలని అన్నారు. ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ప్రలోభాలకు గురి చేస్తే, ఎవరు కూడా ప్రలోభాలకు గురి కావద్దని, ప్రజా ప్రభుత్వంలో ప్రలోభాలకు తావు లేదని, అలాంటి వారు ఎవరన్నా ఉంటే, నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందకుంటే, ప్రజా ప్రతినిధుల దృష్టికి గాని, అధికారుల దృష్టికి గాని తీసుకురావాలని, మాలాంటి వారి దృష్టికి తీసుకువచ్చిన మేము ప్రభుత్వానికి తెలియజేసి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.