Take a fresh look at your lifestyle.

అక్రమ నిర్మాణానికి అరికట్టేది ఎవరు…?

0

అక్రమ నిర్మాణానికి అరికట్టేది ఎవరు…?

– ఇంటిని కమర్షియల్ గా మార్చుకున్న వైనం….

– ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం…

నిజామాబాద్ అర్బన్ ,డిసెంబర్ 30(లోకంతీరు) : నిజామాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు రోజు రోజుకు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. మున్సిపల్ కార్పోరేషన్ అనుమతులు లేకుండా పాత గృహాన్ని కూల్చివేసి కమర్షియల్ రూమ్స్ గా మార్చిన వైనం. నగరంలోని 35వ డివిజన్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు మాత్రం “మామూలు” నిద్రలో ఉన్నట్లు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే 35వ డివిజన్లో సిపిఎం కార్యాలయం దగ్గర అక్రమంగా అనుమతులు లేకుండా కమర్షియల్ శటర్లు తీసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా ఉండడం వలన పలు అనుమానాలకు దారితీస్తుంది. ఒక నెల రోజుల్లోనే అక్రమ నిర్మాణం నిర్మించి కిరాయిలకు ఇవ్వడంతో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. సుమారు ఆరు కమర్షియల్ రూంలు నిర్మించి కిరాయికి ఇవ్వడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడు ఆ మేధా ఉపాధ్యాయుడు.

Leave A Reply

Your email address will not be published.