పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఎడపల్లి , డిసెంబర్ 11 ( లోకంతీరు ) : నేడు జరిగే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారులతో పాటు అసిస్టెంట్ పోలింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అధికారి (ఎంపీడీవో) శంకర్, తాహ సిల్దార్ దత్తాద్రి అన్నారు. మండల వ్యాప్తంగా 10 రూట్లు ఏర్పాటు చేసినట్లు వారుతెలిపారు. 16 మంది రిటర్నింగ్ అధికారులు, ఒక్క వంద 90 మంది పిఓలు, 270 మంది ఏపీవోలు విధుల్లో ఉంటారన్నారు. 17 గ్రామ పంచాయతీలకు గాను బాపునగర్ మినహా 59 మంది సర్పంచులు పోటీలో ఉన్నట్లు వారు చెప్పారు. మొత్తం వార్డులు 166 కాగా వార్డు సభ్యులు 306. మంది పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఓటరు తమ ఓటు హక్కును సద్విని చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ( కౌంటింగ్) లెక్కింపు ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి పోలీసులకు గ్రామాల ప్రజలు, యువకులు, సహకరించాలని వారన్నారు.