Take a fresh look at your lifestyle.

డాక్టర్ కానీ డాక్టరు….

0

డాక్టర్ కానీ డాక్టరు….

– రోగిని పరీక్షించకుండానే.. సిబ్బందే టెస్టులు రాసిన వైనం..

– నగరంలో…ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం.. 

– డియంఎచ్ ఓ స్పందించే నా…

నిజామాబాద్ , డిసెంబర్30 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.ఖలీల్ వాడి ప్రాంతంలో ఓ ఆసుపత్రిలో డాక్టర్ కానీ డాక్టర్ వైద్యం చేశారు.ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ గా అవతారమెత్తి రోగిని పరీక్షిం చకుండానే ఇష్టారీతినా సిబ్బందే టెస్టులు రాసిన ఘటన నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రి లో చోటుచేసుకుంది. బాధి తుల వివరాల ప్రకారం…

నందిపేట్ మండలం, నాలేశ్వర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలు న్యూ రో సమస్యతో బాధపడు తుంది. సోమవారం నిజా మాబాద్ నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో గల ప్రై వేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం తన కుమారుడితో వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన రోగి పేరుని ఆసుపత్రి సిబ్బంది నమోదు చేసుకొని ఓపికి సంబంధించిన ఫీజుని తీసుకున్నారు. అంతే కాకుండా సదరు వైద్యుడు అందుబాటులో లేకపోవ డంతో ఆస్పత్రి సిబ్బంది రోగి తో మాట్లాడి సమస్యను తెలుసుకొని పలు టెస్టులను వెంటనే చేయించుకోని రావాలని రోగికి ఓపి చిట్టి పై రాసి ఇచ్చారు. రోగిని డాక్టర్ పరీక్షించకుండానే టెస్టులు రాయడం ఏమిటి అని సదరు రోగి కుమారుడు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది రోగి తో దురుసుగా మాట్లాడడమే కాకుండా దౌర్జన్యం చేసినట్లు బాధితులు ఆరోపించారు. అంతే కాకుండా ఆసుపత్రి సిబ్బంది రోగికి టెస్టులు రాసిచ్చిన చీటీని లాక్కో వడానికి ప్రయత్నించారు. దీంతో న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బాధితులు ఆందోళన చేశారు. ఈ సంద ర్భంగా బాధితులు మాట్లా డుతూ ఆసుపత్రిలో వైద్యుడు అందుబాటులో లేకున్నా సిబ్బంది రోగిని పరీక్షించి టెస్టులు ఎలా రాస్తున్నారని మండిపడ్డారు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రైవే ట్ ఆస్పత్రుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యశాఖ అధికారి వెంటనే విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. బాధితులు..డియం ఎచ్ ఓ ఏ విదంగా స్పందిస్తారో వేచిచూడాలి…

Leave A Reply

Your email address will not be published.