Take a fresh look at your lifestyle.

అర్ధరాత్రి కారు చోరీ…. చాకచక్యంగా వ్యవహరించి దుండగులను పట్టుకున్న పోలీసులు

0

శుక్రవారం అర్ధరాత్రి కారు చోరీ……

నిజామాబాద్ , జనవరి 12 ( లోకంతీరు ) : నిజామాబాదులో శుక్రవారం బాధితుడు తన ఇంటిముందు పార్క్ చేసిన TS16FH5777 నెంబర్ గల కారును  చోరీ చేసినట్లు 3 వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం గౌతమ్ నగర్ కు చెందిన పవన్ ఈనెల తొమ్మిదవ తేదీన తన ఇంటి ముందు కారును పార్కు చేసి హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది మరుసటి రోజు వచ్చి తన కారు తను పార్కు చేసిన స్థలంలో కనిపించకపోయేసరికి తన కారు చోరీకి గురైందని అనుమానించి బాధితుడు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.

చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న పోలీసులు

ఎట్టకీలకే సీసీ కెమెరాలు మరియు బాధితుల వివరాల సహాయంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీకి గురైనటువంటి కారుని, దొంగలను పట్టుకోవడం జరిగింది.చోరీకి సంబంధించి సహాయ పడిన AP11AD2777 కారును, దొంగలను పోలీసులు పట్టుకొని విచారించగా చోరీకి గురైన TS16FH5777 నెంబర్ గల కారు వివరాలు అందించగా సిబ్బందితో కారును దాచిపెట్టిన ప్రాంతానికి వెళ్లి కారును, కారును దొంగలించిన వారిని సుర నవీన్ (26), s/o నర్సయ్య R/o ధర్మారం, నవీపేట్ మండలంగా, సుధాకర్ (26), s/o హన్మాండ్లు R/o మాయపూర్, నందిపేట్ గా గుర్తించి వారిని పోలీస్  స్టేషన్ కు   తీసుకువచ్చి  వారిపై కేసును నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్. ఐ హరిబాబు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.