Take a fresh look at your lifestyle.

సంఘం తండాలో జాతీయ యువజన దినోత్సవం…..

0

సంఘం తండాలో జాతీయ యువజన దినోత్సవం

బాన్సువాడ, జనవరి 12 ( లోకంతీరు ) : నసురేళ్లబాద్ మండలంలోని సంఘం తండా లో జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమాన్ని సేవా సంఘం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ , నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర మాజీ వాలెంటర్ సునిల్ రాథోడ్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడుతూ కేవలం 39 సం వయస్సులోనే యువతకు స్ఫూర్తి ప్రదాత, భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మార్గదర్శి స్వామి వివేకానంద, నేటితరం యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటే ఆయన అంతటి వారు కాకున్నా జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే కచ్చితంగా ఆయన స్ఫూర్తి గా తీసుకొని సాధిస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కార్యక్రమంలో దూప్ సింగ్, మోహన్ ,మదన్ ,సుమన్ సునిల్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.