Take a fresh look at your lifestyle.

తూతూ మంత్రంగా టాస్క్ ఫోర్స్ దాడులు…

0

తూతూ మంత్రంగా టాస్క్ ఫోర్స్ దాడులు…

భరితెగించి జరుగుతున్న చైనా మంజా విక్రయాలు..

Oplus_0

నిజామాబాద్, జనవరి 14 ( లోకంతీరు ) : మకర సంక్రాంతిని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో గాంధీ చౌక్ ప్రాంతమంతా పతంగుల షాపులతో, జనాలతో రద్దీగా మారి ప్రజలకు రవాణా సౌకర్యానికి ఇబ్బందిగా మారింది. గత వారం రోజుల నుంచి టాస్క్ ఫోర్స్ దాడులు ఎన్ని చేసినా చైనా మాంజ విక్రయాలు మాత్రం ఆగడం లేదు..అధికారుల కనుసైగల్లో ఈ విక్రయాలు జరుగుతున్నట్లు పలు అనుమానాలకు దారితీస్తుంది. మరి ఇన్ని దాడులు జరిగిన చైనా మాంజ విషయంలో అమ్మకాల విషయంలో తయారుదారులకు గాని అమ్మేవారిగాని అధికారులంటే భయం లేకుండా పోయింది. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే చైనా మాంజలో విషయంలోనే కాక మిగతా ఏ విషయాల్లో కూడా అధికారులన్నా, రాజకీయ నాయకులన్న భయం లేకుండా అధికారుల పై నమ్మకం పోతోంది. కాబట్టి టాస్క్ఫోర్స్ అధికారులు , ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఈ విషయంలో గట్టిగా చర్య తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.