నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, జనవరి 14 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిపారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయమైన పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి తెలుగువారి ఇంట పాడిపంటలు సిరిసంపదతో నిండి ఉండాలని దేవుని కోరుకున్నట్టు చెప్పారు.