డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి
– జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంఛార్జి మంథని సామెల్ మాదిగ

కామారెడ్డి జిల్లా, జనవరి 18 ( లోకంతీరు ) : డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మార్పీఎస్ కార్యకర్తపై ఉందని ఎం ఆర్ పి ఎస్ జిల్లా ఇంచార్జి మంథని సామెల్ మాదిగ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. ఈ నెల 25 న కామారెడ్డి జిల్లాకు మందకృష్ణ మాదిగ రానున్నారని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఒక వర్గం నుండి మరో వర్గానికి జరుగుతున్న పోరులో తమ సత్తాను చాటి విజయవంతం విజయవంతం చేయాలన్నారు. గ్రామ గ్రామాలలో మాదిగలను చైతన్యవంతం చేయాలని సూచించారు. వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భుజానికి ఒక డప్పు సంకన వేసుకొని సమావేశానికి హాజరు కావాలన్నారు. ఇప్పటివరకు మండలాలలో, నియోజకవర్గాలలో కార్యక్రమాలు నిర్వహించామని, పూర్తి కమిటీలను ఏర్పాటు చేసి, ఫిబ్రవరి 7 న హైదరాబాద్ తరలించే విధంగా చూడాలన్నారు. ఇంటికొక్క డప్పు తీసుకొని యువకులను కదిలించే బాధ్యతలో నాయకులు చోరవ తీసుకోవాలని సూచించారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు కష్టపడి, మనమందరం 30 రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బట్ట వెంకట్ రాములు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, సీనియర్ నాయకులు కుంటోళ్ల యాదయ్య, గోరుగల్లు బాలరాజు, కొత్తల్ల యాదగిరి, బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు బాలరాజు, గడ్డం సంపత్, సాయిలు, రమేష్, పురుషోత్తం, రాజనర్సయ్య, బట్టు నరేష్, దాకయ్య, గణేష్, భూపతి, తదితరులు పాల్గొన్నారు.