ఎడపల్లి మండల కేంద్రంలో ఉపసర్పంచ్ కు ఘనంగా సన్మానం

ఎడపల్లి , డిసెంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం ఎడపల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మచ్కూరి గంగాధర్ ను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కా రెడ్డి
పూలమాలతో సత్కరించి శాలవలతో ఘనంగా సన్మానించారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాజా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రజిత యాదవ్, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లయ్య యాదవ్, కటకం పెద్ద సాయన్న, బర్దిపూర్ విట్టల్, వెంకటేశ్వర్లు (ఎస్ వి), తదితరులు ఉన్నారు.