Take a fresh look at your lifestyle.

పర్మిట్ రూంలో కుళ్లిపోయిన మాంసాహారం అధికారుల తనిఖీలు..

0

లోకంతీరు వార్తకు స్పందన

పర్మిట్ రూంలో కుళ్లిపోయిన మాంసాహారం అధికారుల తనిఖీలు

ఎడపల్లి, జనవరి 18 ( లోకంతీరు) : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో ని విజయదుర్గ వైన్స్ పర్మిట్ రూమ్ లో తనిఖీలు చేపట్టిన ఆహార భద్రత అధికారి వాసురాం పలు ఆహార నమూనాల సేకరణ పర్మిషన్ లేని పర్మిట్ రూముల పై చర్యలు తీసుకోవాలని మండల వాసుల వినతి. పర్మిట్ రూంలో కుళ్ళిన మాంసాహారం.. దీంతో స్పందించిన జిల్లా ఆహార భద్రత అధికారి వాసురాం శనివారం జాన్కంపేట్ లో గల విజయదుర్గ వైన్స్ పర్మిట్ రూమును తనకి లు చేపట్టారు కుళ్ళిన గుడ్లను వంటకాలో వేసేందుకు ఉంచిన పలు రకాల రంగులను సేకరించి ల్యాబ్ టెస్ట్ కు పంపుతున్నట్లు పేర్కొన్నారు ఆహార పదార్థాలు అమ్మడానికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో అధికారి అందించిన సమాచారం ప్రకారం పర్మిట్ రూంలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని వారికి అనుమతులు పొందే ప్రక్రియను సక్రమంగా పూర్తిచేయాలని జిల్లా ఆహార భద్ర త అధికారులు సూచించారు ఇదిలా ఉండగా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వివరించడం పలు అనుమానాలకు తావిస్తోంది గత రెండు రోజుల క్రితం ఓ యువకుడికి ఈ పర్మిట్ రూంలో తిన్న ఆహారంలో ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరొ చనాలతో ఆసుపత్రి పాలు అయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు

Leave A Reply

Your email address will not be published.