Take a fresh look at your lifestyle.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత చేతుల మీదుగా లోకంతీరు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

0

లోకంతీరు దినపత్రిక దినదిన అభివృద్ధి చెందాలి..మంచి సందేశాత్మక కథనాలు ప్రచురించాలి.

– లోకంతీరు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో….జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత

నిజామాబాద్, జనవరి 24 ( లోకంతీరు )  : లోకం తీరు దినపత్రిక దిన దిన అభివృద్ధి చెందుతూ సమాజానికి ఉపయోగపడేలా మంచి సందేశాత్మక కథనాలను ప్రచురించాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత కోరారు . శుక్రవారం కోర్టు కార్యాలయంలో లోకం తీరు దినపత్రిక క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నో పత్రికలు వస్తున్నాయి. పత్రిక నడపడంలో ప్రచురించడంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయని వాటన్నింటినీ భరించి పత్రికను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత యజమానిదే కాకుండా అందరికీ ఉంటుందని అన్నారు . ప్రతి ఒక్కరూ మంచి మంచి కథనాలు రాస్తూ లోకంతీరు దినపత్రికకు మంచి పేరు తేవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.