దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో ఎస్పిఆర్ ఘన విజయం
-
విజయ కేతనం ఎగురవేసిన కొక్కిరాల సత్యపాల్ రావు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 29 ( లోకంతీరు ) : దేవాపూర్ ఓరియంట్ (అదానీ) సిమెంట్ కంపనీ ఎన్నికల్లో ఎస్పిఆర్కొక్కిరాల సత్యపాల్ రావు ఘన విజయం సాధించారు. శుక్రవారం రోజు జరిగినటువంటి ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోదరుడైనటువంటి కొక్కిరాల సత్య పాల్ రావు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. పోటీలో ప్రత్యర్థి చెన్నూరు ఎమ్మెల్యే లేబర్ మరియు మైనింగ్ మంత్రి గడ్డం వివేక్ మరియు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బలపరిచినటువంటి అభ్యర్థి పుస్కూరి విక్రమ్ రావు మీద 33 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఒక మంత్రి, ఇద్దరి ఎమ్మేల్యే ల బలంతో సునాయాసంగా గెలుస్తామని ఆశతో ఉన్నా అభ్యర్థి మరియు క్యాడర్ నిరాశతో వెనుదిరిగారు.మంత్రి యొక్క వర్గం మరియు మంచిర్యాల ఎమ్మెల్యే సోదరునికి మధ్యన జరిగిన పోటీలో మంత్రి వివేక్ గారి మీద మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పైచేయి సాధించారని స్థానిక ప్రజలు, నాయకులు అనుకుంటున్నారు.