నామినేషన్ సెంటర్లను పరిశీలించిన బోధన్ ఎసిపి

ఎడపల్లి, నవంబర్ 27 ( లోకంతీరు ) : బోధన్ మండలం ఏరాజ్ పల్లి గ్రామంలో ఎన్నికల కమిషన్ కేంద్రాన్ని గురువారం బోధన్ ఎసిపి శ్రీనివాస్ పరిశీలించారు నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తును ఆయన పరిశీలించారు ఎటువంటి ఇబ్బందులు ఉన్న వెంటనే సమాచారం అందించాలని అధికారులకు ఆయన సూచించారు నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు ఏసీపి వెంట బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు సిబ్బంది తదితరులు ఉన్నారు.