తెలంగాణ బాపు కెసిఆర్ పుట్టినరోజు ప్రత్యేకం
– తెలంగాణ మలి ఉద్యమ దశ రూపశిల్పి
– లోకం తీరు న్యూస్ ప్రత్యేకం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : తెలంగాణలోని అన్ని వర్గాలను ఉద్యమ బాటపట్టించడంలో కేసీఆర్ తనదైన శైలిలో తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ఎంతో కసరత్తు చేశారు. అన్ని రంగాల అవసరాలను, దుస్థితిని అధ్యయనం చేశారు. అందుకు అనుగుణంగానే పోరాటాలలో పాల్గొంటూ వచ్చారు. 2003 లో జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర జీవో610 కోసం చేపట్టిన ధర్నాలో కేసీఆర్ నేను సైతం అంటూ ప్లకార్డులు పట్టుకుని అన్ని రకాల ఉద్యమకారుల తో ఉద్యమానికి ఊపిరి పోశారు.
కేసీఆర్ ఉద్యమ బాట…!
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని అత్యంత శాంతియుత మార్గంలో విజయవంతంగా నడిపించిన యోధుడు తెలంగాణ ఉద్యమం కోసం సమాజంలోని అన్ని వర్గాలనూ ఒక్కతాటిపైకి తెచ్చిన అరుదైన ప్రతిభాశాలి, అనూహ్య పోరాట పంథాల రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖరావు
,బహుముక ప్రజ్ఞ, నిరంతర అధ్యయనం, విస్తృత రాజకీయ ల పై అనుభవం కలబోసుకున్న అరుదైన జననేత కేసీఆర్, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింన దశ ఉద్యమంలో మరుపురాని ఘట్టానికి ఊపిరి.
ఉద్యమానికి విస్తృత ప్రచారం..!
ఉద్యమంలోకి జన ప్రవాహం ఈ రెండింటిని ఒకేసారి సాధించే లక్ష్యంతో చేపట్టినదే రాజీవ్ రహదారి దిగ్బంధనం. ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి రాష్ట్ర రహదారిని పోరాట వేదికగా ఎంచుకోవటంలోనే కేసీఆర్ తో పాటు కేసిఆర్ చాణక్యం దాగుంది. అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధిస్తే తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంతేగాక ఆ రహదారి వెంట ఉన్న గ్రామాల, పట్టణాల ప్రజలందరూ ఉద్యమంలోకి వస్తారు. 2006 డిసెంబర్ 29న చేపట్టిన ఈ పోరుబాట అటు ప్రజలకు, ఇటు ఉద్యమానికి నూతనోత్తేజాన్ని ఇచ్చింది.
రాజకీయ వ్యూహాలు హైదరాబాద్ కేంద్రంగా…!
రాజకీయ వ్యూహాలు పన్నటంలో కేసీఆర్ తో పాటు ఎవరైనా..! ఆలోచనలను అంచనా వేయటం ఎవరివల్లా సాధ్యం కాదు. వేసే ప్రతి అడుగూ విజయ తీరానికి బాటలు వేసింది. ఎన్నో పోరాట ఫలితాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు,
పరుగులు పెట్టించిన కేసిఆర్ ఇందిరాపార్క్ దగ్గర 2008 జులై 2న ధర్నా తో పాటు యావత్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. 610 జీవో అమలు కోసం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన ధర్నా ఇది. ఉద్యోగుల సమస్యల పట్ల ఎంతో అవగాహన ఉన్న కేసిఆర్ ఉద్యమంలోకి వారందరినీ భాగస్వాములను చేసిన సందర్భం చాలా గొప్పది.ఇది ఎంత విజయవంతమైందంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు సమైక్య పాలకులకు వణుకు పుట్టించింది.
ధర్నా అంటే ప్రభుత్వాలు డర్నా అనే స్థితికి..!
కేసీఆర్ తో పాటు ఉద్యమాన్ని ఉరుకులు పరుగులతో తీసుకెళ్లగలిగారు.సమైక్య పాలనలో అనాథగా మారిన తెలంగాణకు అమ్మప్రేమ అందించాలన్న మానవీయ ఆలోచనల్లోంచి ఆకృతిదాల్చినదే తెలంగాణ తల్లి. ఉమ్మడి పాలనలో ఉనికిని గుర్తించని తెలంగాణకు స్పష్టమైన రూపురేఖలను ఇచ్చి జనం మనస్సుల్లో ఉన్నత స్థానం కల్పించారు కేసిఆర్. ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన తెలంగాణ ఉద్యమం ఉధృతం చేయటానికి ఎంచుకున్న ఎత్తుగడే అని చెప్పవచ్చు.
శాంతి భద్రతలకు విఘాతం కాకుండా….!
ఉద్యమమంటే చేపట్టిన చోటే వండుకుంటాం, వండు కుంటం వంట వార్పు అన్న రీతిలో 2006లో రాజీవ్ రహదారి దిగ్భందం చేశారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కల్పించకుండా, ఉద్యమం పట్ల ఎవరికైనా సానుభూతి పుట్టేలా పోరాటాలు నడిపించడంలో ఎక్కడికక్కడ ఉద్యమకారు లంతా వంటలు వండుకుని తింటూ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలకు జలక్ ఇచ్చారు. స్థాయీబేధం లేకుండా నాటి రాజకీయ ప్రముఖులంతా కేటీఆర్ తో సహా రోడ్లపైనే భోజనాలు చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఎజెండాగా….!
తెలంగాణ రాష్ట్ర సమితిని 2001 ఏప్రిల్ 27న చంద్రశేఖర రావు హైదరాబాద్
లో ప్రారంభించారు. ప్రథమ వార్షికోత్సవాలను నల్లగొండలో 2002 ఏప్రిల్ 26న నిర్వహించినరు.
అలుపెరుగక తెలంగాణ ఉద్యమంలో….!
అహర్నిశలు పోరాడి తొలిసారి 2007 ఫిబ్రవరి 17 న తన పుట్టిన రోజు వేడుకలను అందరి సమక్షంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పుట్టిన రోజు సంబురం జరుపుకున్న సందర్భం,
తెలంగాణ సాధనకు కేసిఆర్ చేయని పోరాటం లేదు. ఏ పోరాట రూపం చూసినా సుదీర్ఘ అనుభవం కండ్లకు కడుతుంది. సిద్దిపేట నుంచి వరంగల్ వరకు ఉద్యమ పోరు లో చురుకైన పాత్ర
వహించారు.తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన రెండేండ్ల తర్వాత కేసీఆర్ తో పాటు సైకిల్ యాత్రకు పిలుపు
నిచ్చారు. దారి పొడవు
నా ప్రజలతో తెలంగాణ అవసరాన్ని చెప్తూ యాత్ర విజయవంతంగా సాగింది.
ఉద్యమానికి విస్తృత ప్రచారం..!
ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసం…!
అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయం బాగా తెలిసిన కేసిఆర్ అందుకే ఉద్యమకారులకు నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ కల్పిస్తూ వచ్చారు. ఓ వైపు సమైక్యపాలకుల ఎత్తుగడలతో, ధనబలం, అధికారంతో, రాజకీయ పలుకుబడితో తెలంగాణను అడ్డుకుంటుంటే,ఉద్యమకారుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో చైతన్యాన్ని నింపేందుకు జాగరణ సేనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అవసరమైతే దేనికైనా సిద్ధమన్న సంకేతాన్ని పాలకులకు పిలుపునిచారు.
అనడంలో అతిశయోక్తి లేదు 2005లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అధికారంలోకి వచ్చాక..!
ఎన్నో సంక్షేమ పథకాలను
ప్రవేశపెట్టారు. అయితే అవన్నీ ఓట్ల కోసం ఆలోచించి చేసినవి కావు. ఓ వైపు ఉద్యమాన్ని నడిపిస్తూనే అణగారిన వర్గాల గురించి విస్తృత అధ్యయనం చేశారు. 2003 అక్టోబర్ 17న ఉద్యమంలో భాగంగానే దళిత్ ఎంపవర్‌మెంట్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు ఏం చేయాలో నాడే ఓ నిర్ణయానికొచ్చారు అణగారిన వర్గాల స్వావలంబనకు అంకురార్పణ అప్పుడే జరిగింది. దళితబంధు ఆలోచన ఆనాటిదే..!
యావత్తు తెలంగాణ కోసం..!
ఉద్యమిస్తున్న కాలం తో పాటు తన వంతు సహాయం చేపట్టిన మహోత్తర పోరాటంలో సమస్త వర్గాలకు పలికిన ఆహ్వానం. ఈ సందర్భంగా గుండెగుండెన గులాబీ జెండా నిండాలన్న నినాదన్ని ఇచ్చిన కేసిఆర్ పిలుపుకు సంకేతం అని విశ్లేషకులు మేధావులు, అభిప్రాయపడుతున్నారు.