Take a fresh look at your lifestyle.

ఎడపల్లిలో కన్నుల పండువగ సీతారాముల కళ్యాణం….

0

ఎడపల్లిలో కన్నుల పండువగ సీతారాముల కళ్యాణం

 

ఎడపల్లి, ఏప్రిల్ 07 ( లోకంతీరు ) : . ఎడపల్లి గ్రామంలో గల శ్రీరామ మఠంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అవసరమైన పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామ పెద్దలు సమర్పించారు అర్చకుల వేదమంత్రోత్సవాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎడపల్లి సీతారాముల పట్టాభిషేకం ఎడపల్లి శ్రీరామ మఠ నికి ఒక ప్రత్యేకత ఉంది నవమి రోజు జన్మదినో త్సవం నిర్వహించి దశమి రోజున ఉదయం సీతారాముల కళ్యాణం సాయంత్రం పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో సోమవారం సీతారాముల కళ్యాణం కన్నుల పండువ గ నిర్వహించారు శ్రీరామ మఠంలో అన్న జయరాం మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి ఈ కళ్యాణోత్సవం చూడడానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో తరలిరావడం జరిగింది మహిళలు చిన్నారులు మంగళ హారతులతో విగ్రహాలను ఊరేగించడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.