Take a fresh look at your lifestyle.

సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ….

0

సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ

నిజామాబాద్, మే 05 ( లోకంతీరు ) :      మున్సిపల్ కార్మిక సంఘాల (TUCI, AITUC, CITU) జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ జయ కుమార్ గారికి ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె నోటీసును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాలు అమలు కోసం, కనీస పెన్షన్ 9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొంటారన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కే.భూపతి, కే.రాజేశ్వర్, డి.కిరణ్, ఎన్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.